ముంబయి: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. పోలీసులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Sujit JAISWAL / AFP via Getty Images
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముంబయిలో కాల్పులు జరిగాయి.
ముంబయిలోని విలే పార్లే వెస్ట్ ప్రాంతంలో జుహూ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల ఘటన జరిగినట్టు బీబీసీ మరాఠీ తెలిపింది.
ఈ ఘటనను ముంబయి వెస్ట్ జోన్- 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మోహిత్ గర్గ్ ధ్రువీకరించారు.
"టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉన్నారు. ఆయనకు తూటాలు తగలలేదు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు" అని మోహిత్ గర్గ్ చెప్పారు.
కాల్పుల ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
"నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగాయన్న వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ముంబయిలో అసలు ఏం జరుగుతోంది?"
"బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, పలువురు నటులు, నిర్మాతలకు బెదిరింపులు.. ముంబయిలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఇక్కడ చట్టబద్ధమైన పాలన లేదు. కేవలం అరాచకమే రాజ్యమేలుతోంది. ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు" అని ఆయన విమర్శించారు.
"ఒకప్పుడు మహారాష్ట్ర బిహార్‌గా మారిపోయిందని అనేవాళ్లు. కానీ ఇప్పుడు బిహార్ మెరుగైనదని చెప్పాల్సిన సమయం వచ్చింది. ముంబయిని నేరగాళ్ల భయంతో బతికే పరిస్థితిలోకి నెడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఖండించాలి" అని సచిన్ సావంత్ ఆ పోస్ట్‌లో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























