దుర్గమ్మ భక్తుల కోసం లడ్డూ ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?
దుర్గమ్మ భక్తుల కోసం లడ్డూ ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?
ప్రచురణ
దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అందులో భాగంగా.. అమ్మవారి ప్రసాదాల కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా లడ్డూ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఈ లడ్డూ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
భక్తులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి సులభంగా లడ్డూ ప్రసాదాలను పొందవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









