రూ.10నాణేలతో రూ.1.23లక్షల స్కూటీ

వీడియో క్యాప్షన్, 10రూపాయల నాణేలు కూడబెట్టి రూ.1.23 లక్షలతో స్కూటీ కొన్నారు.
రూ.10నాణేలతో రూ.1.23లక్షల స్కూటీ
ప్రచురణ

స్కూటీ కొనేందుకు షోరూంకి వెళ్లి అందుకు అవసరమైన రూ.1.23 లక్షల డబ్బుని 10 రూపాయల నాణేల చిల్లరగా సంచుల్లో తీసుకొచ్చి ఇస్తే ఎలా ఉంటుంది?

మంచిర్యాలోని లక్షెట్టిపేటకు చెందిన బొడ్డు రవి జోసెఫ్ అదే చేశారు.

ఆ నాణేలన్నింటినీ మూడేళ్లపాటు కూడబెట్టానని ఆయన చెప్పారు.

బయటకు వెళ్లి సరుకులు, కూరగాయలు కొన్న సమయంలో నోట్లు మార్చినప్పుడు వచ్చే చిల్లరను ఇలా నాణేల రూపంలో దాచుకున్నట్టు ఆయన చెప్పారు.

ఆయన తెచ్చిన చిల్లర మొత్తం లెక్కబెట్టేందుకు షోరూం సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)