నల్లులను నిర్మూలించడానికి ప్రత్యేకమైన వాక్యూమ్ క్లీనర్.. అసలు ఇంట్లో నల్లులు చేరాయని తెలుసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ పిగట్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఓ ఇంట్లో ఉన్న పరుపుల నుంచి లక్షలాది నల్లులు బయటపడినట్లు పెస్ట్ కంట్రోలర్ గారెత్ డేవిస్ తెలిపారు. గత 38 ఏళ్లలో తాను చూసిన అత్యంత భయానక దృశ్యం ఇదేనని ఆయన చెప్పారు.
గోడలు, గోడలపై అతికించిన పోస్టర్ల (వాల్ పేపర్స్)పైనా అవి కనిపించినట్లు డేవిస్ వెల్లడించారు. దీంతో పరుపులను, బెడ్ ఫ్రేమ్‌లను కాల్చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
వేల్స్‌లోని కార్డిఫ్ ప్రాంతానికి చెందిన డేవిస్, నగరంలోని కాంటోన్ ఏరియాలో ఈ సమస్యను పరిష్కరించడానికి పూర్తి సంరక్షణతో బరిలోకి దిగారు.
లక్షలాది బగ్స్‌ని నిర్మూలించడానికి వారు ఓ ప్రత్యేకమైన వ్యాక్యూమ్ క్లీనర్‌ని వినియోగిస్తున్నారు.
గత నెలలో బొద్దింకల వ్యాప్తిని అరికట్టేందుకు సైతం డేవిస్ చర్యలు తీసుకున్నారు. ఆ ప్రక్రియ ఓ హారర్ సినిమాను తలపించినట్లు ఆయన చెప్పారు.

"నల్లులతో ప్రస్తుతం ఈ ఇళ్లు చాలా భయానకంగా ఉంది" అని గారెత్ పేర్కొన్నారు.
"పరుపు పైకి ఎత్తినప్పుడు లక్షల్లో బగ్స్ కనిపించాయి. వాల్‌పేపర్ వెనుక కూడా వేలల్లో ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనది." అని ఆయన చెప్పారు.
"దుస్తులు, లగేజ్, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ ద్వారా ఇవి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. పరుపులు లేదా గోడల వెనుక దాక్కొని ఉంటాయి." అని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంట్లో బెడ్ బగ్స్ ఉన్నాయని చెప్పడానికి సంకేతాలు ఏమిటి?
సాధారణంగా నల్లులు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటిపై వరుసగా ఎర్రని దద్దుర్లు, దురద వస్తుంటాయి.
తెల్లటి చర్మంపై దద్దుర్లు ఎర్రగా, నలుపు లేదా గోధుమ రంగు చర్మంతో ఉన్నవారిపై పర్పుల్ లేదా అస్పష్టమైన రంగులో ఉంటాయి.
నల్లులు నలిపివేతకు గురైతే బెడ్ మీద రక్తపు మరకలను కూడా గమనించవచ్చు. బెడ్ లేదా ఫర్నిచర్‌పై వాటి మలం బ్రౌన్ రంగులో కనపడవచ్చు.
"అవి మిమ్మల్ని కుడతాయి. బెడ్ షీట్స్‌పై రక్తపు మరకలు కూడా మీకు కనిపిస్తాయి. మీరు వాటిని చూసిన వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలి" అని డేవిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నల్లుల బెడద వదిలించుకోవడం ఎలా?
వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
నల్లులున్న బెడ్ షీట్లలను, దుస్తులను వేడి నీళ్లలో ఉతికి, ఎండలో 30 నిమిషాల పాటు ఆరబెట్టాలి.
బెడ్ షీట్లు, దుస్తులను ప్లాస్టిక్ బ్యాక్‌లో ఉంచి, 3 లేదా 4 రోజుల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి.
తరచుగా ఇంటిని శుభ్రపరచండి. నల్లులు శుభ్రమైన, అపరిశుభ్రమైన ప్రదేశాల్లోనూ ఉంటాయి. తరచుగా ఇంటిని శుభ్రం చేస్తే, వాటిని తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఓ ప్రత్యేకమైన వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా వీలైనన్ని బెడ్ బగ్స్‌ని తొలగించినట్లు డేవిస్ పేర్కొన్నారు.
"ఆ తర్వాత మేము ప్రత్యేకమైన క్రిమీ సంహారకాలను వాడాం. పరుపులు, ఫ్రేములు అన్నింటిని కట్ట కట్టి, తగులబెట్టేశాం. అది అంత హానికరమైనది." అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























