ముంబైలో ఆదివారం
సాయంత్రం టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్ఐ రిపోర్టు చేసింది. వీరిని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపింది.
బాలీవుడ్
నటుడు టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని
కోటా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు హరియాణాకు చెందిన వారు కాగా, ఒకరు బిహార్‌కు
చెందిన వ్యక్తిగా గుర్తించారు.
వారంతా రైలులో పారిపోతుండగా పోలీసులు
పట్టుకున్నట్టు కోటా ఎస్పీ తేజస్వినీ గౌతమ్
ఏఎన్ఐతో చెప్పారు.
700 మందితో గ్యాంగ్ నడుపుతున్న లారెన్స్ బిష్ణోయీ ఎవరు? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల తరువాత ఈ గ్యాంగ్ పేరు ఎందుకు వినిపిస్తోంది?
సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన
ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?
పంజాబ్: ఉపాధి హామీ పథకం కూలీలపైకి దూసుకెళ్లిన కారు-8 మంది మృతి
ఫొటో సోర్స్, Kulvir Singh/BBC
ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో ఏడుస్తూ కనిపించిన మహిళ
పంజాబ్‌లోని
సంగ్రూర్‌లో రోడ్డుపై పని చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపైకి ఒక కారు
దూసుకెళ్లింది. అక్కడ పని చేస్తున్న వారిలో 8 మంది మృతి చెందారు. మరికొందరు కూలీలు
గాయపడ్డారు.
సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖల్
రోడ్లో ఈ ప్రమాదం
జరిగింది. ఆ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిందని
సంగ్రూర్ ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా చెప్పారు. మృతి చెందిన 8 మందిలో ఆరుగురు
మహిళలు ఉన్నారు.
ప్రమాదం
జరిగిన సమయంలో అక్కడ దాదాపు 25 మంది వరకు కూలీలు పని చేస్తున్నట్టు ఆయన
వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం
ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ప్రమాదం
జరిగిన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు
చేస్తున్న సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన కోసం గాలిస్తున్నారు.
ముంబయి: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. పోలీసులు ఏమంటున్నారు?
అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?
క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు
ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?
ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?
మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?
కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి
ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?
బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?
గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?
పాకిస్తాన్‌కు ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్ష పదవి
ఫొటో సోర్స్, Tingshu Wang - Pool/Getty Images
ఫొటో క్యాప్షన్, పాలక మండళ్లకు తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి అహద్ ఖాన్ చీమాను ఎన్నుకున్నారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు గ్రూప్ (డబ్ల్యూబీజీ) పాలక మండళ్లకు పాకిస్తాన్ 2027లో అధ్యక్షత వహించనుందని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది.
1953 తర్వాత, 73 ఏళ్లకు పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది.
బ్యాంకాక్‌లో జరిగిన డబ్ల్యూబీజీ-ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా
పాలక మండళ్లకు తదుపరి అధ్యక్షుడిగా
పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి,
ప్రపంచ బ్యాంకులో ఆ దేశ గవర్నర్ అయిన అహద్ ఖాన్ చీమా పేరును ప్రకటించారు.
ఐఎంఎఫ్,
ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో 191 దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కేంద్ర బ్యాంకుల గవర్నర్లు,
ఆర్థిక విధాన రూపకర్తలు, వ్యాపార రంగ ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎల్కే అడ్వాణీ
ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ ఛాతీ ఇన్ఫెక్షన్తో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు
పీటీఐ రిపోర్ట్ చేసింది.
“అడ్వాణీ ప్రస్తుతం ఐసీయూలో న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది” అని తెలిపింది.
రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న
రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో
అడ్డుకున్నారు.
ఈ ఆంక్షలలో కొన్నింటిని
నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన
కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్
సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి
ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక
కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్
ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై
ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.
ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు,
ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే
గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న
మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.
ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక
వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే
మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.
అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు
ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి
బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక
లేఖ రాసింది.
గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు
‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్