నేడు ప్రతిపక్షాల మార్చ్: భద్రతా కారణాలతో దిల్లీలో 6 మెట్రో స్టేషన్లు మూసివేత

ఫొటో సోర్స్, Getty Images
భద్రతా కారణాలతో సోమవారంనాడు ఆరు మెట్రో స్టేషన్లను దాదాపు 10 గంటల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను అనుమతించబోమని డీఎంఆర్‌సీ తెలిపింది.
“భద్రతా కారణాల దృష్ట్యా 2026 అక్టోబర్ 12న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌లను మూసివేస్తాం” అని ఓ ప్రకటనలోపేర్కొంది.
ఆ తర్వాత భద్రతా సంస్థలు పరిస్థితిని సమీక్షిస్తాయని, అవసరాన్ని బట్టి తదుపరి సమాచారం అందిస్తామని తెలిపింది. అయితే, సంబంధిత అన్ని మెట్రో స్టేషన్లలో రైళ్లు మారేందుకు ప్రయాణికులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
మూసివేసిన ఆరు మెట్రో స్టేషన్లు:
పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్.
మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం మార్చ్ నిర్వహించనున్నారు.


