దిల్లీ: ఇండియా కూటమి సుప్రీంకోర్ట్ పాదయాత్ర - 7 ఫోటోలలో

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ను తప్పించాలని, ఓట్ల చోరీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు వరకు చేపట్టిన పాదయాత్ర నాటకీయ పరిణామాల మధ్య సాగింది.

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పాటు అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే ఈయాత్రలో పాల్గొన్నారు.

వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సెంట్రల్ దిల్లీ వీధులు నిండిపోయాయి.

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ

ఈ యాత్ర బారా ఖంబా మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమైంది. మండీ హౌస్ మీదుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు భావించారు.

సుప్రీంకోర్టుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను మండీ హౌస్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.

నిరసనకారులు కొంతసేపు రోడ్డుపై కూర్చున్న తర్వాత, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెనుదిరిగి ఇండియా గేట్ వైపు మళ్లారు.

అంతకుముందు వారిని ఆపినప్పుడు నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణ జరగగా పోలీసులు వారిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించారు.

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ

యాత్ర సుప్రీంకోర్టుకు 500 మీటర్ల దూరానికి చేరుకున్న తర్వాత పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మండీ హౌస్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసుల్ని మోహారించారు. దీంతో బారికేడ్లు దాటుకుని వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది.

కొంతమంది కార్యకర్తలు బారికేడ్ల మీద నుంచి దూకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు.

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ

మండీ హౌస్ వద్ద నిరసనకారులు కొంతసేపు రోడ్డుపై కూర్చున్న తర్వాత, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెనుదిరిగి ఇండియా గేట్ వైపు మళ్లారు.

కొంత సమయం తరువాత, రాహుల్ గాంధీ కాన్వాయ్ తిరిగి వచ్చి ఇండియా గేట్ వైపు కదిలింది.

ఇండియా గేట్ సర్కిల్ వద్దకు తమను పోలీసులు అనుమతించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

దీంతో కాన్వాయ్ మరో మార్గంలో ముందుకు సాగింది. ఆ తర్వాత నాయకులందరూ సుప్రీంకోర్టు గేట్ బి వద్దకు చేరుకున్నారు.

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ

బారాఖంబా రోడ్డుకు, సుప్రీంకోర్టుకు మధ్య దూరం సుమారు 2 కిలోమీటర్లు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్య తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ర్యాలీకి ముందు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఇవి వేర్వేరు నిరసనలు కాదని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఒకే నిరసన అని అన్నారు.

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ

మార్చ్ ప్రారంభం కావడానికి ముందు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నిరసనకారులు, విద్యార్థులు, న్యాయవాదులతో సహా వివిధ సంస్థలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

బారా ఖంభా మెట్రో స్టేషన్ నుంచి రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులు బస్సు ఎక్కి సుప్రీంకోర్టుకు బయలుదేరారు.

తాము సుప్రీంకోర్టుకు చేరుకుని ప్రధాన న్యాయమూర్తికి ఒక వినతిపత్రాన్ని సమర్పిస్తామని రాహుల్ గాంధీ ఆదివారం స్పష్టం చేశారు.

ఈ వినతి పత్రంలో జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతో పాటు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఈ యాత్రలో పాల్గొనాలని ఆయన అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కోరారు.

జ్ఞానేశ్ కుమార్, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇండీ కూటమి, దిల్లీ
ఫొటో క్యాప్షన్, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)