‘‘నన్ను బలవంతంగా టాయ్లెట్లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సిమా కొటెచా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హెచ్చరిక :ఈ కథనంలో లైంగిక హింసకు సంబంధించిన వివరణాత్మక అంశాలు ఉన్నాయి
నటుడు, కమేడియన్ రస్సెల్ బ్రాండ్ తనను రేప్ చేశారని ఆరోపించిన ఓ మహిళ ‘‘దాడి జరుగుతున్న సమయంలో కళ్లు మూసుకుని, నేను అక్కడ లేనని భావించడానికి ప్రయత్నించానని’’ పోలీసులకు చెప్పారు.
ప్రస్తుతం బ్రాండ్‌పై జరుగుతున్న న్యాయవిచారణలో భాగంగా 2023లో ఓ అధికారి ఆమెతో చేసిన వీడియో ఇంటర్వ్యూను జ్యూరీకి చూపించారు. ఛానల్ 4లో ప్రసారమయ్యే బిగ్ బ్రదర్స్ బిగ్ మౌత్ కార్యక్రమానికి రస్సెల్ బ్రాండ్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం గురించి ఆయనతో తాను మాట్లాడుతుండగా, ఆయన తనపై లైంగిక దాడి చేశారని ఆ మహిళ ఆరోపించారు.
51 ఏళ్ల బ్రాండ్‌పై ఏడు అభియోగాలు ఉన్నాయి. వీటిలో అత్యాచారానికి సంబంధించినవి మూడు, లైంగిక దాడికి సంబంధించిన మూడు, అసభ్యకరంగా లైంగిక దాడి చేయడంపై ఒక అభియోగం ఉన్నాయి. మొత్తం ఆరుగురు మహిళలు 1999 నుంచి 2009 మధ్య పదేళ్ల కాలంలో ఈ ఘటనలు జరిగినట్టు ఆరోపించారు.
అప్పట్లో అమ్మాయిలను చులకనగా చూసే సంస్కృతి కారణంగా ( 2000నాటిలాడ్ కల్చర్) తాను రస్సెల్ బ్రాండ్ గురించి ఫిర్యాదు చేయలేకపోయానని ఆ మహిళ సౌత్‌వార్క్ న్యాయస్థానానికి చెప్పారు.

లండన్‌లోని సోహో ప్రాంతంలోని ఓ బార్లో 2004లో తన వక్షోజాలు పట్టుకుని లాగి, తరువాత టాయ్లెట్లోకి లాక్కుపోయి అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించారు.
పోలీసుల ముందుకు రావడానికి తాను రెండు దశాబ్దాలపాటు ఎదురుచూశానని అసలు ఫిర్యాదు చేయాలనే ఆలోచనే తనకు వణుకు పుట్టించేదని ఆమె చెప్పారు.
ఆయన లాంటి సెలబ్రిటీ గురించి తనలాంటి సామాన్యురాలు చెబితే ఎవరూ నమ్మరని భావించినట్టు చెప్పారు. ‘ఒకవేళ నేను ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే ఆఫీసులో నా సహచరులు నన్ను వెలివేస్తారని భయపడ్డా’ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘‘తప్పు జరిగిందని చెబితే నాదే తప్పు అనేవారు’’
ప్రస్తుతం సాక్ష్యం చెబుతున్న మహిళ ఆ సమయంలో ఎంటీవీ చానల్లో పనిచేసేవారు. ఆ సమయంలో తన చుట్టూ ఎప్పుడూ ప్రముఖ వ్యక్తులు ఉండేవారని ఆమె చెప్పారు.
‘‘ఆరోజులలో ఓ మహిళ తనకు ఇలా అన్యాయం జరిగిందని చెబితే ఎవరూ నమ్మేవారు కాదు, ఇలాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే ఆ పరిస్థితికి అవకాశం కల్పించావు అని చెప్పే చెత్త వాదనలన్నీ వినాల్సి వచ్చేది’’ అన్నారు.
కానీ ‘‘ఇప్పుడు రోజులు మారాయి’’ అని ఆమె కోర్టులో నీలం రంగు తెర వెనుక నుంచి సాక్ష్యం ఇస్తూ పేర్కొన్నారు.
రస్సెల్ బ్రాండ్ తనపైకి దూసుకువచ్చి తనను బలవంతంగా పట్టుకున్నప్పుడు, ఆయన ముఖంలో కనిపించిన 'ఒక విచిత్రమైన నవ్వును' ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ నవ్వును ఆమె ఓ జోకర్ ముఖంతో పోల్చారు.
అయితే రస్సెల్ బ్రాండ్ లాయర్ మాత్రం ఆ మహిళ, బ్రాండ్ పరస్పర అంగీకారంతో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడానికి, కౌగిలించుకోవడానికి టాయిలెట్లోకి వెళ్లారని ఆయన వాదించారు. కానీ ఆ టాయిలెట్ అంతా నీళ్లతో నిండిపోయి, అత్యంత అధ్వాన్నంగా ఉండటం వల్లే వారు శారీరకంగా కలవాలనే ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకున్నారని కోర్టుకు చెప్పారు.
కన్నీటి పర్యంతమవుతూ సాక్ష్యం చెబుతున్న ఆ మహిళ మాత్రం బ్రాండ్ లాయర్ చెప్పిన విషయాలను ఖండించారు. తనపై జరిగిన దాడితో దిగ్భ్రమకు గురయ్యాయని ఆమె చెప్పారు.
ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా టాయిలెట్లోకి లాక్కెళ్లారనే వాదనపై నిందితుడి లాయర్ ఆమెను గట్టిగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె గనక ప్రతిఘటించి, లేదా సహాయం కోసం కేకలు వేసి ఉంటే.. అక్కడ నుండి బయటపడటం ఆమెకు 'చాలా తేలిక' అయ్యేదని లాయర్ వాదించారు.
కానీ ఆ మహిళ ఆ వాదనను పూర్తిగా తిరస్కరించారు. తనను బ్రాండ్ చాలా బలంగా పట్టుకున్నాడని చెబుతూ.. ఆ సమయంలో 'ఇదంతా త్వరగా ముగిసిపోయి, ఇక్కడి నుంచి బయటపడితే చాలు' అనిపించిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Metropolitan Police/PA Media
అది ‘అత్యాచారం’కిందకే వస్తుంది
ఆ ఘోర ఘటన జరిగిన తర్వాత తన శరీరం, మనసు అంతా మొద్దుబారిపోయాయని, తనపై తనకే అసహ్యం కలిగిందని వివరించారు.
తాను ఆ తర్వాత ఈ విషయాన్ని ఒక స్నేహితురాలికి చెప్పానని ఆమె కోర్టుకు చెప్పారు. బ్రాండ్ తనపై 'దాడి చేయడానికి ప్రయత్నించాడు' అని మాత్రమే స్నేహితురాలికి చెప్పానని, కానీ అతడు తనపై అత్యాచారం చేయడంలో 'సఫలమయ్యాడు' అనే పూర్తి నిజాన్ని చెప్పడానికి భయపడ్డానని తెలిపారు.
తనపై జరిగిన ఆ వికృతమైన మౌఖిక దాడి చట్టపరంగా 'అత్యాచారం' కిందికే వస్తుందనే కనీస విషయం కూడా ఆ సమయంలో తనకు తెలియదని ఆమె ప్రాసిక్యూషన్ లాయర్‌కు చెప్పారు.
అంతకుముందు 2023లో ఒక పోలీస్ అధికారితో ఆ మహిళ మాట్లాడిన వీడియో ఇంటర్వ్యూను జ్యూరీకి చూపించారు. రస్సెల్ బ్రాండ్ ఛానల్-4 లో ప్రసారమయ్యే 'బిగ్ బ్రదర్స్ బిగ్ మౌత్' షోకి హోస్టింగ్ చేయడం గురించి తాను ఆయనతో మాట్లాడుతున్న సమయంలోనే.. ఆయన తనపై ఈ లైంగిక దాడికి ఒడిగట్టాడని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
‘‘ఆయనతో మాట్లాడుతుంటే హఠాత్తుగా ఆయన నా వక్షోజాలను పట్టుకు లాగారు. ఆ సమయంలో నా కళ్ల ముందు ఒక వికృతమైన, పిచ్చి నవ్వు నవ్వుతూ, నాపైకి దూసుకువస్తూ నా వక్షోజాలను పట్టుకోవడం నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది’’ అని ఆమె చెప్పారు.
కొద్దిసేపటి తర్వాత, నేలంతా నీటితో నిండిపోయిన టాయ్లెట్లోకి తనను బలవంతంగా లాక్కెళ్లాడని ఆమె చెప్పారు. అక్కడ ఆయన తన ‘‘ప్యాంట్ జిప్ విప్పి’’ తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Julia Quenzler
‘వేగంగా జరిగిపోయింది, దిగ్భ్రమకు గురయ్యా’
లైంగిక దాడి చాలా వేగంగా జరిగిపోయిందని, జరిగిన విషయాన్ని తాను నమ్మలేని స్థితిలోకి వెళ్లిపోయి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె కోర్టుకు చెప్పారు.
'ఆయన నిలబడిన స్థలానికి వెనుక వైపే టాయిలెట్లు ఉన్నాయి. ఆయన నన్ను హఠాత్తుగా గట్టిగా పట్టుకుని లాగేశారు నా చేతిని చాలా బలంగా పట్టుకుని లాక్కుపోయారు' అని ఆమె వివరించారు.
'ఇదంతా ఎలాగో త్వరగా ముగిసిపోతే, ఇక్కడి నుండి బయటపడవచ్చు' అని నా మనసు చెప్పింది అన్నారు.
'నేను కేవలం నా కళ్ళు గట్టిగా మూసుకున్నాను, మానసికంగా అక్కడ లేనట్లు ఉండటానికి ప్రయత్నించాను. అది ఒక పెద్ద బలాత్కారంలాగా అనిపించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఖచ్చితంగా "నాకు ఇది ఇష్టం లేదు" అని చెప్పాను' అని ఆమె కోర్టుకు వివరించారు.
అత్యాచారం జరిగినట్లు ఆరోపిస్తున్న సమయంలో తన వయసు 20 ఏళ్లలో ఉందని తెలిపిన ఆ మహిళ, ఆ ఘటన తర్వాత బ్రాండ్ తనవైపు తిరిగి ఏమీ జరగనట్టుగా "ఇప్పుడు మనం ఫోన్ నంబర్లు మార్చుకోవాలి కదా" అని అన్నట్లు చెప్పారు.
"ఏమీ జరగనట్లుగా, నన్నేమీ బలవంతం చేయనట్టుగా ఆయన సాధారణంగా మాట్లాడాడు" అని ఆమె అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణన్నింటినీ రస్సెల్ బ్రాండ్ ఖండించారు. తాను నిర్దోషినని కోర్టుకు తెలిపారు. లైంగిక సంబంధాలు జరిగినట్లయితే, అవి పరస్పర అంగీకారంతోనే జరిగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ విచారణ ఆరు వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























