నేపాల్‌లో ఆకస్మిక వరదలు: 100 మందికిపైగా భారతీయుల గల్లంతు, వరద బీభత్సం 11 ఫోటోలలో...

ఫొటో సోర్స్, RSS
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా కనీసం 291 మంది విదేశీ పర్యటకులు సహా వందలాది మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. నేపాల్‌లో 18 మంది మరణించారు. ఆ దేశ పర్యటక శాఖ అందించిన సమాచారం మేరకు గల్లంతైన వారి ప్రాథమిక జాబితాలో భారత్‌కు చెందిన 100 మందికి పైగా, యూకేకు చెందిన 12 మంది ఉన్నారు.
చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లో "భారీ ప్రాణనష్టం" జరిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా కూడా నివేదిస్తోంది .
నేపాల్ నుంచి ధృవీకృతమైన వీడియోలలో, వరద నీటి ఉధృతికి ఒక వంతెన కొట్టుకుపోవడం, బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవడం కనిపిస్తోంది.
నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో బురద వరద నీరు ప్రవహించిన తర్వాత ఇళ్లు పాక్షికంగా మునిగిపోయినట్లు ఇతర చిత్రాల్లో కనిపిస్తోంది.
భూకంపం ఆకస్మిక వరదలకు దారితీయడం వల్ల ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.


ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, RSS

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, BBC/Ishwor Joshi

ఫొటో సోర్స్, BBC/Shaktimaya Tamang

ఫొటో సోర్స్, X
నేపాల్ నుండి ధృవీకరించిన వీడియోలలో, వరద నీటి ఉధృతికి ఒక వంతెన కొట్టుకుపోవడం, బహుళ అంతస్తుల భవనాలు కూలిపోవడం, ఓ పట్టణంలో అనేక భవనాలు ధ్వంసమైన అనంతర దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కఠ్మండుకు వాయువ్యంగా సుమారు 16 మైళ్ల (25 కి.మీ.) దూరంలో ఉన్న భాగమతి ప్రావిన్స్‌లోని నువాకోట్ జిల్లాలోని త్రిశూలి బజార్ ప్రాంతంలో ఈ క్లిప్‌లు ఉన్నట్లు బీబీసీ వెరిఫై గుర్తించింది.

ఫొటో సోర్స్, RSS

ఫొటో సోర్స్, BBC/Shaktimaya Tamang

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, Sunil Pradhan/Anadolu via Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























