కారు టాప్ మీద హెడ్ కానిస్టేబుల్.. ఆపకుండా 40 కిలోమీటర్లు తీసుకెళ్లిన 'గుట్కా ముఠా'
కారు టాప్ మీద హెడ్ కానిస్టేబుల్.. ఆపకుండా 40 కిలోమీటర్లు తీసుకెళ్లిన 'గుట్కా ముఠా'
ప్రచురణ
కారు టాప్ మీద ప్రమాదకర పరిస్థితుల్లో ఒక కానిస్టేబుల్‌ను గమనించి కూడా 40 కిలోమీటర్ల వరకు వేగంగా దూసుకెళ్లిన కారును చివరకు పోలీసులు పట్టుకున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఇది జరిగింది.
విళాంగురిచిలో వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఒక కారు పూర్తిగా తనిఖీ చేయకముందే హఠాత్తుగా దూసుకెళ్లడంతో, హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగున్ దానిపైకి దూకారు.
అయితే, కారు పైన ఉన్న ఆయన్ను పట్టించుకోకుండా కార్లో ఉన్నవాళ్లు దానిని హైస్పీడులో నడిపారు.
ఇతర పోలీసులు వెంబడించి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని అవినాశిలో ఆ కారును ఆపగలిగారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









