పది రూపాయల నోటు వెనకున్న ఈ చక్రం గురించి తెలుసా?
ఇది పది రూపాయల నోటుపై ఉన్న గాంధీజీ బొమ్మను మీరు చూసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా ఈ నోటుపై ఉన్న మోటిఫ్ లేదా డిజైన్‌ను గమనించారా?
ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద చక్రం ఎక్కడుంది. అసలు ఇదేంటి?
ఇది సన్ టెంపుల్. అంటే సూర్య దేవాలయం.
ఒడిశాలోని పూరీకి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని కోణార్క్‌లో ఈ ఆలయం ఉంటుంది.
భారతీయ కళ, చరిత్ర, సంస్కృతి, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీక ఈ చక్రం.
13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం ఒక రథంలా ఉంటుంది.
దీనిని సూర్య భగవానుడి రథంగా పిలుస్తారు.
ఈ ఆలయంలో 12 జతలు, అంటే 24 భారీ చక్రాలు ఉన్నాయి. ఒక్కో చక్రం వ్యాసం సుమారు 3 మీటర్లు ఉంటుంది. ఈ చక్రాలపై అద్భుతమైన కళాకృతులను చెక్కారు.
అంతే కాదు, ఈ రథాన్ని లాగుతున్నట్లుగా ఏడు గుర్రాలను చెక్కారు.
ఈ ప్రాచీన ఆలయాన్ని తూర్పు గంగ రాజవంశానికి చెందిన మహారాజా నరసింహ దేవ-1 నిర్మించారు. దీని రూపశిల్పి బిసు మహారాణా అని చెబుతారు.
దీని నిర్మాణానికి 1200 మంది కళాకారులు 12 ఏళ్లు కష్టపడి పనిచేశారని అంటారు.
ఎంత విచిత్రం అంటే.. చరిత్ర మన జేబులోనే దాగి ఉంటుంది, కానీ మనం మాత్రం దాన్ని బయట ఎక్కడో వెతుకుతుంటాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









