నీళ్లు కావాలంటే ఇలా బావిలోకి దిగాల్సిందే..

వీడియో క్యాప్షన్, తాగునీటి కోసం కష్టాలు
నీళ్లు కావాలంటే ఇలా బావిలోకి దిగాల్సిందే..
ప్రచురణ

గుజరాత్‌కు చెందిన ఈ మహిళలు తాగునీటి కోసం ప్రతి రోజూ దాదాపు 45 అడుగుల లోతున్న బావిలోకి దిగుతుంటారు.

ఈ దృశ్యాలు వల్సాడ్ జిల్లాలోని కపరాడా తాలూకా మోతీ పలసన్ గ్రామంలోనివి. ఇక్కడ ప్రతి రోజూ తాగడానికి, వంటకు నీళ్లు తెచ్చుకోవడం వీరికి సవాలుగా మారుతోంది.

బక్కెట్ నీళ్ల కోసం గ్రామంలోని మహిళలు ఇనుప మెట్ల మీద, తాళ్లు కట్టుకుని నుంచి 45 అడుగుల లోతు బావిలోకి దిగుతారు.

ఈ ప్రయత్నంలో చాలాసార్లు మహిళల కాలు జారి వాళ్లు బావిలో కూడా పడిపోతుంటారు. అలా పడిపోయి తీవ్రంగా గాయపడిన వారున్నారు.

దాదాపు 1200 జనాభా ఉన్న ఈ పల్లెలో 8 ప్రభుత్వ బావులు ఉన్నాయి. కానీ వేసవికాలంలో అవన్నీ ఎండిపోతాయి.

కపరాడా, ధరంపూర్, చుట్టుపక్కల మారుమూల పల్లెలకు నీళ్లు అందించేందుకు 586 కోట్ల రూపాయల వ్యయంతో అస్టోల్ గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ అమలు చేశారు.

కానీ తమకు తాగునీరు అందడం లేదని స్థానికులు అంటున్నారు.

అస్టోల్ పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాత్రం గ్రామానికి నీరు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.

నీళ్లు, మహిళలు, బావి, గుజరాత్,

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)