తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..

ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Sudha Pola/BBC

ఫొటో క్యాప్షన్, ఎండ వేడికి తట్టుకోలేక చల్లని నీళ్లతో ముఖం కడుక్కుంటున్న కానిస్టేబుల్ (లొకేషన్: బోయిన్‌పల్లి)
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం బుట్టాయగూడెంలో అత్యధికంగా 45.65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది.

తెలంగాణలో ఇవాళ (మే 23వ తేదీన) మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనా వేసింది.

ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

ఫొటో క్యాప్షన్, సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓ మామిడి తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్ వద్ద సేదదీరుతున్న తల్లీకూతుళ్లు
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద..

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళలో, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలోని తొర్రగుడిపాడులో, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలోని చిట్యాలలో 45 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Sudha Pola/BBC

ఫొటో క్యాప్షన్, భానుడి భగభగలకు రక్షణగా గొడుగు (లొకేషన్ : కొంపల్లి)

కుమురం భీమ్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా 45 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఈ డేటాలో వెల్లడైంది.

ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి కుండ
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Sudha Pola/BBC

ఫొటో క్యాప్షన్, వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాటి ముంజలు కొంటున్న హైదరాబాద్ నగర వాసులు
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Sudha Pola/BBC

ఫొటో క్యాప్షన్, వీధి కుక్క దాహం తీరుస్తున్న వ్యక్తి
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, మండుటెండలో కొబ్బరి బోండాల వ్యాపారి
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫొటో సోర్స్, Sudha Pola/BBC

ఫొటో క్యాప్షన్, సికింద్రాబాద్ సమీపంలో ఎండ వేడికి తట్టుకోలేక తలను నీళ్లతో తడుపుకుంటున్న వ్యక్తి
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద మజ్జిగ పంపిణీ
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎండలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, ఎండను భరించలేక మినీ ఫ్యాన్‌తో బయటికి వచ్చిన వ్యక్తి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)