చెట్టు మీద కూడా ఇల్లు ఇంత అందంగా కట్టుకోవచ్చా? ‘మాయాలోకం’లా అనిపించే 9 ట్రీహౌస్‌ల విశేషాలు ఏంటో చూడండి.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Woodnest/ Sindre Ellingsen

    • రచయిత, డెబొరా నికోల్స్-లీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

చెట్టు మీద ఇల్లు కట్టుకోవడమంటే పిల్లలు ఆడుకునే ఆట కాదు. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో ఆర్కిటెక్టులు రూపొందించిన ఈ గూడు ఆకారపు ఇళ్లు, నగర జీవనానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ప్రత్యేకమైన ప్రదేశాలుగా మారాయి.

క్రీ.శ. 77 ప్రాంతంలో ప్లినీ ది ఎల్డర్ రాసిన నేచురల్ హిస్టరీలో చెట్లపై నివాసానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఒక పెద్ద చెట్టుపై రోమన్ రాజుకి మంత్రి లిసినియస్ ముసియానస్ విందు ఏర్పాటు చేసినట్లు ప్లినీ పేర్కొన్నారు.

ఆయన ఆ చెట్టు కొమ్మలపైనే రాత్రి గడిపారని, ఆకుల మధ్య నుంచి జారిపడే వర్షపు చినుకుల శబ్దం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని రాశారు.

చెట్లపై నివాసానికి వివిధ కాలాల్లో అనేక మంది భిన్నమైన విధానాలను అనుసరించినప్పటికీ, ప్రకృతితో మళ్లీ అనుబంధం ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష వారందరిలోనూ కనిపిస్తుంది.

చెట్ల మధ్య ఉన్నప్పుడు ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుందని, కాలం నెమ్మదించినట్లు అనిపిస్తుందని మోడ్రన్ ట్రీ హౌసెస్ పుస్తక రచయిత సీబెక్ పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ట్రీహౌస్‌లు ఒకవైపు సేదతీరే స్థలాలకు ప్రతీకలుగా, మరోవైపు ప్రకృతివైపు తిరిగి తీసుకెళ్లే సాధనాలుగా నిలుస్తాయి. ఆయన తన పుస్తకంలో పేర్కొన్న ఆధునిక ట్రీహౌస్‌ 9 ఇళ్ల విశేషాలు ఏంటో చూద్దాం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Massimo Crivellari

ఫొటో క్యాప్షన్, పీన్యా బై బెల్‌త్రామె స్టూడియో, మార్ల్‌బరో ఘెట్టో, ఇటలీ(2017)

ఇటాలియన్ ఆల్ప్స్ అందమైన దృశ్యాలను వీక్షించేలా 1,200 మీటర్ల ఎత్తులో ఈ రెండు ట్రీహౌస్‌లు భారీ పైన్ కోన్‌ల ఆకారంలో ఉన్నాయి.

స్ప్రూస్ కలపతో చెక్కి, లార్చ్ కలప రీపర్‌తో నిర్మించిన వీటిలో వెళితే ఒక మాయాలోకంలోకి ప్రవేశించినట్లుగా, ఎవరో ఒడిలో పొదువుకున్న అనుభూతి కలుగుతుందని సీబెక్ రాశారు.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Tom Klocker

ఫొటో క్యాప్షన్, బెర్ట్ బై స్టూడియో ప్రెక్ట్ - తుర్నావు, ఆస్ట్రియా (2021)

ఇది ఓ ట్రీహౌస్ కంటే చెట్టులాగే ఉంటుందని, 2018లో భార్య ఫెయితో కలిసి స్టూడియో ప్రెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌ను స్థాపించిన క్రిస్ ప్రెక్ట్ చెబుతున్నారు.

కొమ్మలు విస్తరించిన చెట్టు కాండంలా ఉండే దీని మాడ్యులర్ నిర్మాణాన్ని త్వరగా అమర్చవచ్చు, అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు లేదా విస్తరించుకోవచ్చు.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Zhu Ziye

ఫొటో క్యాప్షన్, కీయున్ మౌంటెన్ యూఎఫ్ఓ బై ఆటెలీయర్ డిజైన్ కంటిన్యూయమ్ - కీయున్ పర్వతం, చైనా(2022)

ఎగిరే పళ్లెంలా కనిపించే అన్‌ఐడెంటిఫైడ్ ఫారెస్ట్ ఆబ్జెక్ట్ మౌంట్ కీయున్ నేషనల్ పార్క్‌లో 2022లో కొలువుదీరింది.

చుట్టూ ఉన్న వరండా నుంచి పైన్ అడవి, దూరంలోని పర్వతాలను మొత్తం చూసేయచ్చు.

పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు స్థానికంగా లభించే రెడ్ సీడార్‌తో నిర్మించిన ఈ కట్టడాన్ని ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Santiago Baravalle

ఫొటో క్యాప్షన్, 'ది ట్రిలియం' బై అవేకనింగ్ ఎక్స్‌పీరియెన్సెస్ - యుకాటన్, మెక్సికో (2024)

చెట్లపై నివాసం అంటే విలాసాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ట్రిలియమ్ ట్రీహౌస్‌లో సొంత స్విమ్మింగ్ పూల్, జాకుజీ కూడా ఉన్నాయి.

దాని పేరు, ఆకృతికి స్ఫూర్తినిచ్చిన మూడు రేకుల పువ్వు ప్రకృతిలోని సామరస్యానికి సంప్రదాయ చిహ్నం.

ఈ నిర్మాణం ప్రకృతి నుంచి సహజంగా మొలిచినట్టుగా కనిపిస్తుందని సీబెక్ అన్నారు.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Matts Engfors

ఫొటో క్యాప్షన్, బయోస్పియర్ బై జర్కె ఇంగ్లెస్ గ్రూప్, బిగ్ - హరడ్స్, స్వీడన్ (2022)

కొంతమంది ట్రీహౌస్ వాస్తుశిల్పులకు ప్రకృతికి దగ్గరగా ఉండటం అంటే దాన్ని ఇంట్లోకి ఆహ్వానించడమే. అడవి చెట్ల కొమ్మల మధ్య తేలియాడుతున్నట్టుగా కనిపించే బయోస్ఫియర్‌లో 350 పక్షుల గూళ్లు ఉన్నాయి.

దీంతో పక్షులతో పాటు గబ్బిలాలు, తేనెటీగలు కూడా అక్కడికి ఆకర్షితమవుతాయి. స్వీడిష్ లాప్‌లాండ్‌లోని ట్రీహోటల్‌లోని ఎనిమిది విభిన్న డిజైన్లలో ఇది ఒకటి.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Carlos Chavarría

ఫొటో క్యాప్షన్, లోమా మార్ ట్రీ హౌస్, జే నెల్సన్ స్టూడియో - కాలిఫోర్నియా, అమెరికా (2020)

చేతితో తయారు చేసిన ఫర్నిచర్, ఓడల కిటికీలను తలపించే పోర్ట్‌హోల్స్, పెరిస్కోప్‌తో జే నెల్సన్ తన పిల్లల కోసం శాంటా క్రూజ్ పర్వతాల్లోని రెడ్‌వుడ్ అడవిలో ఈ ట్రీహౌస్‌ను నిర్మించారు.

అయితే అది పూర్తయిన కొద్దికాలానికే పిల్లలకంటే పెద్దలకే ఎక్కువగా నచ్చిన ప్రదేశంగా మారింది.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Viggo Lundgerg

ఫొటో క్యాప్షన్, ట్రీ టెంట్స్ ఇంటర్నేషనల్ ట్రీ టెంట్ - డలార్నా, స్వీడన్ (2016)

ఒకప్పుడు వ్యవసాయ క్షేత్రంగా ఉన్న నాసెట్స్ మార్కస్‌గార్డ్‌లో పైన్ చెట్లకు వేలాడుతున్న ఈ భారీ ఎర్రటి బంతి క్రిస్మస్ అలంకరణ కాదు. అల్యూమినియం, ప్లైవుడ్ ఫ్రేమ్‌కు నీటిని నిరోధించే కాన్వాస్‌ను చుట్టి రూపొందించిన ఈ నిర్మాణాన్ని ట్రీ టెంట్‌గా పిలుస్తారు.

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Woodnest/ Sindre Ellingsen

ఫొటో క్యాప్షన్, 'వుడ్‌నెస్ట్' బై హెలెన్ అండ్ హార్డ్ - ఒడ్డా, నార్వే (2020-2023)

కొంతమంది డిజైనర్లుకు, ట్రీహౌస్ అంటే పూర్తిగా రోమాన్స్‌కు సంబంధించింది. క్జార్టన్ ఆర్నో తన ప్రియురాలు సాలీకి మ్యారేజ్ ప్రపోజ్ చేద్దామనుకున్నారు.

ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ ట్రీహౌస్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దాని ఫలితమే ఈ అద్భుమైన ట్రీహౌస్

ట్రీహౌస్, చెట్లపై నివసించడం

ఫొటో సోర్స్, Chris and Pam Daniele

ఫొటో క్యాప్షన్, 'ది కాపర్ ఫాక్స్' బై హైడీ రిచర్డ్స్, నికోలస్ కోట్ - మైన్, అమెరికా (2023)

కాపర్ ఫాక్స్‌ను రిచర్డ్స్ తన భర్త నికోలస్‌తో కలిసి ఎక్కువగా స్థానికంగా లభించే వస్తువులతో నిర్మించారు. ఇది భారీ స్థాయిలో రూపొందించిన శిల్పంలా కనిపించాలన్నదే ఉద్దేశమని ఆమె చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)