చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు, 82 మంది మృతి

ఫొటో సోర్స్, China Photos/Getty Images
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు
చైనాలోని ఒక బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడులో 82 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది.
''షాంగ్జీ ప్రావిన్సులోని టోంగ్జౌ గ్రూప్‌కు చెందిన లియుషెన్యు బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 82 మంది చనిపోయినట్లు తెలిసింది'' అని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ 'జిన్హువా' పేర్కొంది.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:29 గంటలకు (భారత కాలమానం శుక్రవారం సాయంత్రం 4:59) ఈ పేలుడు సంభవించింది.
ప్రమాదం జరిగిన సమయంలో గనిలో దాదాపు 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























