You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చనిపోయిన తల్లి గర్భం నుంచి బతికిన బిడ్డ కోసం, రెండు కుటుంబాల పోరాటం
చనిపోయిన మహిళ గర్భం నుంచి జన్మించిన శిశువు కోసం రెండు కుటుంబాలు పోరాటం చేస్తున్నాయి.
ఈజిప్టులో చికిత్స పొంది, ఇటీవల గాజాకు తిరిగివచ్చిన రెండేళ్ల పాలస్తీనా బాలుడి కోసం రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయి.
2023 నవంబర్‌లో గాజా సిటీలోని అల్-షిఫా ఆసుపత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన 31 మంది ప్రిమెచ్యూర్ శిశువులలో మహమూద్ ఒకరు.
అతను ఫాతిమా అల్‌హిర్ష్ కుమారుడని భావిస్తున్నారు. ఆమె తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలో ఉన్నప్పుడు ప్రసవం జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మరణించారు.
మహమూద్‌ను కలవడానికి ఫాతిమా భర్త అహ్మద్ దాదాపు రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు.
మహమూద్ ఈజిప్టులో ఉన్నప్పుడు, అతనితో అహ్మద్ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడేవారు.
కానీ, సరిగ్గా ఇలాంటి కథతోనే మరో తండ్రి తన కుమారుడి కోసం వెతుకుతూ ముందుకు వచ్చారు.
ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరూ కూడా ఆ బిడ్డ జన్మించిన సమయంలో అక్కడ లేరు.
యుద్ధం కారణంగా ఇద్దరూ గాయపడి, గర్భవతి అయిన తమ భార్యలకు దూరమయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)