You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
మేక్రాన్: ‘రోజూ మాట్లాడొద్దు.. రోజుకో మాటొద్దు, ఇదేమీ షో కాదు’ ట్రంప్‌ను ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడి కామెంట్స్
ఒక ప్రైవేట్ లంచ్ సమయంలో ఫ్రెంచ్ యాసలో మేక్రాన్‌ను ట్రంప్ ఎగతాళి చేశారు. మేక్రాన్ భార్య బ్రిజిట్ భర్తతో సరిగ్గా వ్యవహరించడం లేదని, దవడకు తగిలిన దెబ్బనుంచి కోలుకోవడానికి మేక్రాన్ ఇంకా ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడారు.
ఇరాన్ యుద్ధం కారణంగా ఇండియాలో నీరు, బీరు ధరలు పెరగనున్నాయా?
గాజు బాటిళ్ల ధరలు సుమారు 20 శాతం పెరిగాయని హైనెకెన్, కార్ల్స్‌బర్గ్ వంటి గ్లోబల్ బ్రూవర్లకు ప్రాతినిధ్యం వహించే బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో బీరు ధరలను 12 నుంచి 15 శాతం పెంచేందుకు రాష్ట్రాలను సంప్రదించాలని సభ్య సంస్థలను కోరినట్లు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాయిటర్స్‌కు తెలిపింది.
రాకాస మూవీ రివ్యూ: ‘కోటలోని రాక్షసుడు’ భయపెట్టాడా.. బోర్ కొట్టించాడా?
హీరో ఈరబాబు, సుబ్బలక్ష్మి ప్రేమలో పడతాడు. అయితే ఊళ్లో నుంచి సోము (వెన్నెల కిషోర్) మాయమవడంతో అతన్ని ఈరబాబే చంపాడని అంటారు. ఈ లోగా మూడు హెచ్చరికలు వస్తాయి. బలికి ఈరబాబు వెళ్లాల్సి వస్తుంది. కోటలోకి వెళ్లిన అతను ఏమయ్యాడు? రాక్షసుడు ఏం చేసాడు? ఇది మిగతా కథ.
బైకర్ మూవీ రివ్యూ: రేసులో జోరు తగ్గిందా? శర్వానంద్‌కు తండ్రిగా రాజశేఖర్ నటన ఎలా ఉంది?
దర్శకుడు అభిలాష్‌రెడ్డి మోటో క్రాస్ రేస్‌లపై చూపిన శ్రద్ధ , పరిశోధన మెచ్చుకోతగింది. రేస్‌లు ఎలా జరుగుతాయి, శిక్షణ , మెలకువలు అన్నీ అధ్యయనం చేశాడు. అయితే కేవలం రేస్‌లు చూడడానికి ప్రేక్షకులు రారు. టీవీలో ఎప్పుడైనా చూడొచ్చు. స్పోర్ట్స్‌ని ఒక ఎమోషనల్ కథతో కనెక్ట్ చేయాలి.
నేటో నుంచి బయటకు వచ్చేయాలని ట్రంప్ ఎందుకు అనుకుంటున్నారు? అమెరికా వైదొలగితే నేటో ఏమవుతుంది?
అమెరికా యుద్ధవిమానాలకు బ్రిటన్ తొలుత అనుమతి నిరాకరించింది. తర్వాత తన విధానం మార్చుకుంది. రక్షణాత్మక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆ ఆలస్యంపై ట్రంప్, ఆయన రక్షణ మంత్రి విమర్శలు చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి స్టార్మర్ను రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నాయకుడైన చర్చిల్తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు.
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ బందీని చేసింది', హార్ముజ్ జలసంధి సమస్య పరిష్కారం కోసం 40 దేశాల నేతల సమావేశం
"అంతర్జాతీయ నౌకాయాన మార్గాన్ని ఇరాన్ హైజాక్ చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా మార్చడం చూస్తున్నాం. ఇది కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ, ఒమన్, ఇరాక్ వాణిజ్య మార్గాలను దెబ్బతీస్తోంది. అంటే.. ఆసియాకు అందాల్సిన ఎల్ఎన్జీ, ఆఫ్రికాకు ఎరువులు, ప్రపంచానికి విమాన ఇంధనం నిలిచిపోతున్నాయి." అని ఇవెట్ కూపర్ అన్నారు.
వీడియో, ఆర్టెమిస్ 2 రాకెట్ లాంచ్‌ను విమానంలో నుంచి చూస్తే..., వ్యవధి 0,16
విమానంలోని ప్రయాణికులు ఒక చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన క్షణం ఇది.
భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భర్తను పట్టించిన గ్యాస్ సిలిండర్
భార్యను హత్య చేసి నాలుగేళ్లుగా వేషధారణ మార్చి, వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్న భర్తను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు చేసిన ఒక చిన్న పొరపాటు ఇతడిని కటకటాల వెనక్కి నెట్టింది. ఈ 'సిలిండర్' గుట్టు ఏమిటంటే..
హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతిస్తాం, కానీ శత్రువులకు నో ఎంట్రీ: ఇరాన్ విదేశాంగ శాఖ
చమురు రవాణాకు ముఖ్యమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శత్రువులకు తప్ప మిగిలిన నౌకలను అనుమతిస్తామని స్పష్టం చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.