గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
‘‘నేను మొన్న ఉదయం అభిజీత్‌తో మాట్లాడాను. 'అమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి' అని అభిజీత్ నాతో చెప్పాడు’’ అని అనితా దీప్కే చెప్పారు.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీకి దిల్లీ పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీచేశారు. ఈ ర్యాలీ కోసం ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు మైదానాన్ని బుక్ చేసుకోవచ్చు.
రామ్‌లీలా మైదాన్, సీబీడీ గ్రౌండ్, బురారీ గ్రౌండ్లను నిరసన కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలుగా గుర్తించినట్టు దిల్లీ పోలీసుల సెంట్రల్ జిల్లా డీసీపీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు.
మైదానం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోడానికి కాంగ్రెస్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ని సంప్రదించిందని, మైదానం అందుబాటులో ఉంటుందని ఎంసీడీ వారికి తెలిపిందని రోహిత్ రాజ్‌బీర్‌సింగ్ తెలిపారు.
"మైదానం అందుబాటులో ఉందని తెలిపే ధ్రువీకరణ పత్రం అందిన తర్వాత దిల్లీ పోలీసులను కాంగ్రెస్ సంప్రదించింది. పార్టీ ప్రతినిధులతో మాట్లాడి, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అవసరాలను అర్థం చేసుకున్న తర్వాత పోలీసులు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని నిర్ణయించారు" అని ఆయన చెప్పారు.
ఇప్పుడు కాంగ్రెస్ ఈ ధ్రువీకరణపత్రాన్ని ఎంసీడీకి సమర్పిస్తుంది.
గ్రౌండ్‌ను బుక్ చేసుకోవాలనుకునే ఇతర పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించవచ్చని డీసీపీ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
అభిజీత్ దీప్కేకు బెయిల్ లభించడంపై ఆయన తల్లి అనితా దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.
"నిన్నటి నుంచి మేం చాలా ఒత్తిడికి గురయ్యాం, ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉంది. మా అత్తయ్య చనిపోయి ఇంకా పది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఇది జరగడం మమ్మల్ని చాలా కలచివేసింది" అని ఆమె చెప్పారు.
‘‘నేను మొన్న ఉదయం అభిజీత్‌తో మాట్లాడాను. 'అమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి' అని అభిజీత్ నాతో చెప్పాడు’’ అని అనితా దీప్కే చెప్పారు.

ఫొటో సోర్స్, Tingshu Wang - Pool/Getty Images
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు గ్రూప్ (డబ్ల్యూబీజీ) పాలక మండళ్లకు పాకిస్తాన్ 2027లో అధ్యక్షత వహించనుందని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది. 1953 తర్వాత, 73 ఏళ్లకు పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది.
బ్యాంకాక్‌లో జరిగిన డబ్ల్యూబీజీ-ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా పాలక మండళ్లకు తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి, ప్రపంచ బ్యాంకులో ఆ దేశ గవర్నర్ అయిన అహద్ ఖాన్ చీమా పేరును ప్రకటించారు.
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో 191 దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కేంద్ర బ్యాంకుల గవర్నర్లు, ఆర్థిక విధాన రూపకర్తలు, వ్యాపార రంగ ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ ఛాతీ ఇన్ఫెక్షన్తో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.
“అడ్వాణీ ప్రస్తుతం ఐసీయూలో న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది” అని తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.
ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.
ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.
ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.
అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

ఫొటో సోర్స్, ANI
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేశారని, ఆయనను ఎస్ఈఎం కోర్టులో హాజరుపరచనున్నారని పార్టీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ఎక్స్ పోస్టులో తెలిపారు.
అభిజిత్‌ను ఎక్కడ ఉంచారనే విషయం ఇంకా తెలియలేదని, న్యాయవాదులను కూడా కలవనివ్వడం లేదని రత్నా సింగ్ తెలిపారు.
“జరిగిన పరిణామాలను అర్థం చేసుకోండి. నిరసనకు అనుమతి ఇచ్చేందుకు దిల్లీ పోలీసులు నిరాకరించారు. అందరిపై నిఘా ఉంచారు. అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత నిర్బంధానికి పంపించారు. అభిజిత్ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని దిల్లీ పోలీసులు వెంటనే వెల్లడించాలి. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారు, ఆయన పరిస్థితి ఏమిటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు, న్యాయవాదులకు లేదా సంబంధిత వ్యక్తులకు తెలియజేయకుండా గంటల తరబడి నిర్బంధంలో ఉంచకూడదు. దీనికి దిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలి” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ‘లెహరా దో తిరంగా’ మార్చ్ పిలుపు మేరకు అక్టోబర్ 16న దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో పలువురు త్రివర్ణ పతాక మార్చ్ నిర్వహించారు.
అయితే, మార్చ్ ప్రారంభానికి ముందే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను వామపక్ష విద్యార్థి సంఘం ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రమే దిల్లీ పోలీసులు నేహాను నిర్బంధించారు. దీంతో అర్ధరాత్రి వరకు కూడా ఏఐఎస్ఏ కార్యకర్తలు నేహాను ఏ పోలీసుస్టేషన్లో నిర్బంధించారో చెప్పాలని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఆర్కే పురం పోలీసుస్టేషన్లో నేహాను నిర్బంధించినట్టు అర్ధరాత్రి తరువాత తెలిసింది. దాదాపు 5గంటలపాటు ఆమెను నిర్బంధించారు.

ఫొటో సోర్స్, Ritesh Shukla/Getty Image
నేహా న్యాయవాది సుపంత్ సిన్హా మాట్లాడుతూ ‘‘నేహాను ఆర్కేపురం పోలీసుస్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. ఆమెను తన న్యాయవాదితో మాట్లాడటానికి కూడా అనుమతించలేదు’’ అని చెప్పారు.
అయితే శనివారం ఉదయం నేహా తన ఎక్స్ హ్యాండిల్లో తనను ‘దిల్లీ పోలీసులు విడుదల చేశారు’ అని రాశారు. అలాగే ‘నిర్బంధంలో ఉన్నవారినందరినీ దిల్లీ పోలీసులు విడుదల చేయాలి. రాజ్యాంగం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడటాన్ని నేరంగా మార్చకూడదు’ అని చెప్పారు.
ఓపక్క నిర్బంధాలు కొనసాగుతున్నప్పటికీ కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్‌కు వందలాది మంది విద్యార్థులు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, పౌర సంఘాల వారు చేరుకున్నారు. దీంతో, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
“శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలకు నష్టం జరగదు. నగరం మొత్తాన్ని మూసివేయాలని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని, సొంత పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడే వ్యాపారాలకు నష్టం జరుగుతుంది” అని మార్చ్‌కు ముందు దీప్కే అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.