లైవ్, దిల్లీ : కన్నాట్ ప్లేస్‌లో భారీగా పోలీసు బలగాలు

దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో అక్టోబర్ 16న ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో సీజేపీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీసులు న్యూదిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

సారాంశం

  • సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మామ్, జెడ్డాకు విమానాలను ఈనెల 20 వరకు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
  • దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో అక్టోబర్ 16న 'లెహ్రా దో తిరంగా' పేరుతో సీజేపీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీసులు న్యూదిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
  • స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.
  • దిల్లీ పోలీసులు, ఐబీ సిబ్బంది తన ఇంటిని చుట్టుముట్టారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అన్నారు.
  • అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో టీచర్‌తో పాటు 5, 8, 11 సంవత్సరాల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
  • బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

లైవ్ కవరేజీ

  1. అభిజిత్ దీప్కే ఉంటున్న ఇంటికి చేరుకున్న దిల్లీ పోలీసులు

    Delhi Police
    ఫొటో క్యాప్షన్, అభిజిత్ దీప్కే ఉంటున్న ఇంటికి చేరుకున్న దిల్లీ పోలీసులు

    కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే బస చేస్తున్న ప్రదేశానికి దిల్లీ పోలీసు బృందం చేరుకుంది.

    అభిజీత్ దీప్కే.. ఎన్‌సిపి శరద్ పవార్ వర్గం అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసంలో ఉంటున్నారు.

    దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం ‘లహరా దో తిరంగా’ కార్యక్రమంతో నిరసనలకు దీప్కే పిలుపునిచ్చారు.

    ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఆయన ఉంటున్న ‘గవాండే’ నివాసానికి చేరుకున్నారు.

  2. అక్టోబర్ 20 వరకు సౌదీకి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

    సౌదీ అరేబియా, ఎయిర్ ఇండియా విమానాలు
    ఫొటో క్యాప్షన్, విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మామ్, జెడ్డాకు ఈనెల 20వ తేదీవరకు విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని , విమానాల రాకపోకల పునరుద్ధరణకు తగిన పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తున్నామని ఎయిర్ లైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

    విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమ అత్యుత్తమ ప్రాధాన్యత అని పేర్కొంది.

    అంతకుముందు, సౌదీలోని స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, వైమానిక దాడి జరిగితే ఇంట్లోనే ఉండాలని పౌరులను కోరుతూ భారత రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో సూచించింది.

    సౌదీ అరేబియా నుంచి తక్షణమే వెళ్లాల్సిన అవసరం ఉన్న భారతీయ పౌరులు బహ్రెయిన్, కువైట్, ఖతార్‌ నుంచి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది.

    ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించగా, 10 మంది గాయపడ్డారు.

  3. కన్నాట్ ప్లేస్‌లో భారీగా పోలీసు బలగాలు

    సీజేపీ, దిల్లీ , కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌, ‘లెహ్రా దో తిరంగా’
    ఫొటో క్యాప్షన్, కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

    దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో అక్టోబర్ 16న ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో సీజేపీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీసులు న్యూదిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

    సోషల్ మీడియా, ప్రెస్ మీట్ ద్వారా అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాలతో తరలిరావాలని ప్రజలకు సీజేపీ పిలుపునిచ్చిందని దిల్లీ పోలీసు డీసీపీ నేహా యాదవ్ తెలిపారు.

    ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని నేహా యాదవ్ వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో, కన్నాట్ ప్లేస్‌లో మూతపడిన దుకాణాలు , భారీగా పోలీసు బలగాల మోహరింపు కనిపించాయి.

    సీజేపీ, దిల్లీ , కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌, ‘లెహ్రా దో తిరంగా’
    సీజేపీ, దిల్లీ , కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌, ‘లెహ్రా దో తిరంగా’
    సీజేపీ, దిల్లీ , కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌, ‘లెహ్రా దో తిరంగా’
    సీజేపీ, దిల్లీ , కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌, ‘లెహ్రా దో తిరంగా’
    సీజేపీ, దిల్లీ , కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌, ‘లెహ్రా దో తిరంగా’
  4. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టార్ లింక్
    ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  5. నన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది - అభిజిత్ దీప్కే

    దిల్లీ, అభిజిత్ దీప్కే
    ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసులు తనను అదుపులోకి తీసుకోవచ్చని అభిజిత్ దీప్కే అన్నారు.

    దిల్లీ పోలీసులు, ఐబీ సిబ్బంది తన ఇంటిని చుట్టుముట్టారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అన్నారు.

    "ఇంటి చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఐబీ సిబ్బంది, దిల్లీ పోలీసు అధికారులు తిరుగుతున్నారు. నేను బయటకు వెళ్లినప్పుడల్లా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నన్ను అనుసరిస్తున్నాయి. నేను తిరిగి రాగానే, ఐబీ, పోలీసు సిబ్బంది మా వాచ్‌మన్‌తో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి, దిల్లీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకోవచ్చు" అని మీడియాతో అభిజిత్ చెప్పారు.

  6. సూట్‌కేసులో పాములు, బల్లులను తరలిస్తున్న వ్యక్తిని అడ్డుకున్న అధికారులు

    జర్మనీలోని కోలాన్ బాన్ విమానాశ్రయం
    ఫొటో క్యాప్షన్, బ్రెజిల్‌కు చెందిన పరిచయస్తుడి కోసం ఆ జంతువులను తెచ్చినట్లు నిందితుడు అధికారులకు చెప్పారు.

    జర్మనీలోని కోలాన్ బాన్ విమానాశ్రయంలో 90కి పైగా బల్లులు, విషపూరిత పాములను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు అడ్డుకున్నారు.

    45 ఏళ్ల మెక్సికన్ అగ్నిమాపక సిబ్బంది సభ్యుడు గ్రీన్ ఎగ్జిట్ గుండా వెళ్తున్న సమయంలో "అనుమానాస్పదంగా ఆందోళన చెందుతూ" కనిపించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

    ఆ వ్యక్తికి అధికారులు డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన సూట్‌కేసును తనిఖీ చేశారు. అందులో ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కానీ, షాంపూ, క్రీమ్ సీసాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, సాక్సులలో దాచిన వైపర్లు, రాటిల్‌స్నేక్స్, ఇగువానాలతో పాటు ఇతర జాతుల పాములు, బల్లులు దొరికాయి.

    "విమానాశ్రయంలో సూట్‌కేసులలో తెచ్చే జ్ఞాపికల విషయంలో మా సహచరులు చాలా చూశారు. కానీ మెక్సికో నుంచి 37 సజీవ విషసర్పాలు, 55 బల్లులు రావడం ఇదే మొదటిసారి" అని కోలాన్ కస్టమ్స్ కార్యాలయ ప్రతినిధి జెన్స్ అహ్లాండ్ తెలిపారు.

    కొన్ని జంతువులను "అమానుషమైన పరిస్థితుల్లో" ఉంచినట్లు అహ్లాండ్ చెప్పారు. మరికొన్ని మెక్సికో నగరం నుంచి ఇస్తాంబుల్ మీదుగా ప్రయాణించే సమయంలో చనిపోయాయి.

  7. అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల, అమెరికాలో కాల్పులు
    ఫొటో క్యాప్షన్, బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్‌ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

    కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

    తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

    ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.

    ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.