You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ యుద్ధం: ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు.. ఎప్పుడు ఏం జరిగింది?
హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరిస్తే ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఉంటుందని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో సాగిన చర్చల అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏప్రిల్ 8న ఉదయం చెప్పారు.
ఇరాన్‌పై దాడులు ఆపితే కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆ దేశ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో అమెరికాతో తదుపరి చర్చలు జరుగుతాయని ఇరాన్ సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది.
ఈ సీజ్ ఫైర్ నేపథ్యంలో... ఇరాన్ యుద్ధంలో ఇప్పటి వరకు జరిగిందో క్లుప్తంగా చూద్దాం..
గల్ఫ్‌లో నౌకలపై దాడి చేసినట్లు ఇరాన్ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడటంతో ముడి చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో అనేక దేశాల్లో చమురు కొరత ఏర్పడింది.
ఆ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలు, వంతెనలపై దాడి చేస్తామని డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
హార్ముజ్ విషయంలో ఒక ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ను రాతియుగంలోకి నెట్టేస్తామని, ఒక్క రాత్రిలోనే ఇరాన్ నాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. డెడ్ లైన్ కూడా విధించారు.
భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఆ డెడ్‌లైన్ ముగియనుండగా... దానికి సరిగ్గా పది నిమిషాల ముందు అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ గురించి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రకటన చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)