ఇంట్లోకొచ్చిన చిరుత, తరిమిన కుక్క
ఇంట్లోకొచ్చిన చిరుత, తరిమిన కుక్క
ప్రచురణ
ఓ చిరుతపులి సైలెంట్ ఇంట్లోకి దూకగానే అక్కడే ఉన్న పెంపుడు కుక్క తరిమేయడంతో.. అది బయటకు పారిపోయింది.
ఈ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురంలో జరిగింది.
ఈ ఘటనపై స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డితో బీబీసీతో మాట్లాడారు.
ఆ గ్రామం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో చిరుతపులి వచ్చినట్లు భావిస్తున్నామన్నారు.
అలాగే, ఆ చిరుతపులి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని, ఆ తర్వాత మళ్లీ జనవాసాల్లో కనిపించలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, ugc









