గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జ్యోతిని వెలిగించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జ్యోతిని వెలిగించేందుకుభారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
"నేను నా స్నేహితుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఒక ధైర్యవంతుడైన భారత పైలట్‌తో కలిసి జ్యోతిని వెలిగించడానికి ఆయనను ఆహ్వానించాను," అని‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
తన ఆహ్వానానికి మోదీ ధన్యవాదాలు తెలిపారని నెతన్యాహు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత్, ఇజ్రాయెల్ దేశాలు భూమార్గంలోనూ, గగనతలంలోనూ కలిసి ఉగ్రవాదంపై పోరాడుతున్నాయని మోదీ అన్నారని.. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను ఆయన ప్రశంసించారని తెలిపారు.
కాగా సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, తన ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ తన అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Sanka VIDANAGAMA / AFP via Getty Images
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో అత్యధికంగా సంజూ శామ్సన్ 67 పరుగులు సాధించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 పరుగులు, నమన్ ధిర్ 42 పరుగులతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Schwoerer/Getty Images
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు, 40 బంతుల్లో 82 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
226 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు.
మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటయ్యాక స్కోరు వేగం మందగించినా, కెప్టెన్ శ్రేయర్ అయ్యర్, నమన్ ధిర్ (15 బంతుల్లో 42 పరుగులు) రాణించడంతో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.

ఫొటో సోర్స్, Allison/Getty Images

ఫొటో సోర్స్, Kai Schwoerer/Getty Images
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.
జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

ఫొటో సోర్స్, ANI
గురువారం జరిగిన పారా ఆసియా క్రీడల్లో భారత్ రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుంది.
ఆర్చరీలో శీతల్ దేవి, టోమన్ కుమార్ జోడి స్వర్ణం గెలుచుకోగా, మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో సువర్ణ రాజ్ స్వర్ణ పతకం సాధించింది.
ఆర్చరీ ఫైనల్‌లో శీతల్ దేవి, టోమన్ కుమార్ జోడి ఇండోనేషియాకు చెందిన టియోడోరా ఆడి అయూడియా ఫెర్రెలీ, కెన్ స్వాగుమిలాంగ్‌లను 151-148 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత జోడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 ఈవెంట్‌లో సువర్ణ రాజ్ 15.66 మీటర్లు త్రో చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల నాలుగో రోజున భారత అథ్లెట్లు మొత్తం తొమ్మిది పతకాలను గెలుచుకున్నారు. వీటిలో రెండు స్వర్ణాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.
పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత అథ్లెట్లు ఇప్పటివరకు 16 స్వర్ణాలు, 22 రజతాలు, 33 కాంస్యాలతో సహా మొత్తం 71 పతకాలను గెలుచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కి చెందిన వేల మంది ఖాతాదారుల సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయింది.
ఈ డేటా ఉల్లంఘనపై బ్యాంకు విచారణను ప్రారంభించినట్లు బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. డార్క్ వెబ్‌లో లీక్ అయిన డేటాలో, 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత గుర్తింపు సమాచారం (పీఐఐ) ఉన్నట్లు బ్యాంకు తెలిపింది.
దీనివల్ల వారు మోసాలకు గురయ్యే అవకాశం ఉందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి సమర్పించిన ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. అయితే, దీనిని ఎదుర్కోవడానికి, దాని ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు ప్రారంభించినట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఘటన వల్ల తమ వ్యాపార కార్యకలాపాలపై, ఆర్థిక పనితీరుపై లేదా లావాదేవీలపై ప్రభావం పడలేదని స్పష్టం చేసింది.
డార్క్ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, అందులో 3,897 రికార్డుల్లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించామని బ్యాంకు పేర్కొంది. డార్క్ వెబ్‌లో లీక్ అయిన సమాచారంలో కస్టమర్ డేటాలో వారి పేరు, లింగం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి, ఇంటి చిరునామా, బ్యాంకు శాఖ ఐఎఫ్ఎస్సీ కోడ్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ నంబర్లు, లీడ్ ఐడీలు, రుణాలు లేదా లీడ్‌లకు సంబంధించిన మెటాడేటా ఉన్నాయి.
అక్టోబర్ 16న తమ 'థ్రెట్ ఇంటెలిజెన్స్' సర్వీస్ ప్రొవైడర్, 'డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ' 'CERT-In' నుంచి డార్క్ వెబ్‌లో డేటా అందుబాటులో ఉండవచ్చనే హెచ్చరికలు అందాయని ఎస్బీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు 'CERT-In' గుర్తింపు పొందిన ఒక స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థను బ్యాంకు నియమించింది.
డార్క్ వెబ్‌లో లభించే సమాచారం ఆధారంగా, మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగిగా నటిస్తూ కస్టమర్‌కు ఫోన్ చేయవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కస్టమర్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి, వారి వివరాలు అడగవచ్చు. కస్టమర్‌కు పేరు, చిరునామా, రుణానికి సంబంధించిన సమాచారం లేదా మొబైల్ నంబర్‌తో ఫోన్ చేస్తే, ఆ వ్యక్తి బ్యాంకు ఉద్యోగి అయి ఉండవచ్చని ఖాతాదారులు భావించవచ్చు.
అందుకే కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి, కానీ తమ బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయిందని ఆందోళన వద్దని నిపుణులు చెబుతున్నారు. కస్టమర్లు ఓటీపీలు, పిన్‌లు, పాస్‌వర్డ్‌లను పంచుకోకూడదు. అనుమానాస్పద కాల్స్ లేదా లింక్‌ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి మోసాలను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు సూచించింది. దీని ప్రకారం-

ఫొటో సోర్స్, I & PR Andhra Pradesh
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.
అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.