మద్యం బాటిళ్ల లారీ బోల్తా, సీసాలు ఎత్తుకెళ్లిన జనం

వీడియో క్యాప్షన్, మద్యం బాటిళ్ల లారీ బోల్తా, తర్వాత ఏం జరిగిందంటే...
మద్యం బాటిళ్ల లారీ బోల్తా, సీసాలు ఎత్తుకెళ్లిన జనం
ప్రచురణ

మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వ్యాన్ బోల్తా పడడంతో అక్కడికి చేరుకున్న జనం చేతికి దొరికినన్ని బాటిళ్లు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

చిత్తూరులోని ప్రభుత్వ గౌడౌన్ నుంచి కొల్లాపురంలోని ఒక వైన్ షాపుకు మద్యం తరలిస్తున్న వ్యాన్ ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డి పల్లె గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బోల్తాపడింది.

దీనిపై ఎస్ఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేశారు.