ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.
లైవ్ కవరేజీ
గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?
రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.
ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.
ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.
ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.
అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.
అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.
గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు
‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్
అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించండి: మోదీకి ఖర్గే లేఖ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, మల్లికార్జున్ ఖర్గే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
"2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.
"నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"
‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.
ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.
రణబాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?
మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.
భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.
పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.
రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"
స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.
భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?
క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?
జైలర్ 2-మూవీ రివ్యూ: సూపర్ హిట్ సినిమాల ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యారా? రజినీ సీక్వెల్ ఎలా ఉంది?
ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?
‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఫొటో సోర్స్, I& PR AP
ఫొటో క్యాప్షన్, ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.
భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష
జనసేనలో చేరిన వంగవీటి రాధ

ఫొటో సోర్స్, JANASENA
ఫొటో క్యాప్షన్, జనసేనలో చేరిన వంగవీటి రాధ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.
వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్ఫ్లూయెన్సర్
జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

ఫొటో సోర్స్, @RahulGandhi
ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.
సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
“జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.
"విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.
"త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.
మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
కోళ్ళూరు: వజ్రాలగనికి మారుపేరుగా నిలిచిన ఈ ఊరు ఇప్పుడెలా ఉంది, ఇప్పటికీ వజ్రాలు దొరుకుతున్నాయా?
గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం,
నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
