లైవ్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్, నవంబర్ 1న పోలింగ్, 3న లెక్కింపు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొత్త షెడ్యూల్‌ను గురువారం రాత్రి విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయితీలకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 1న జరపనున్నారు.
సారాంశం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను గురువారం రాత్రి విడుదల చేసింది.
టిబెట్‌లో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
లైవ్ కవరేజీ
యెమెన్ సమీపంలో భారత నావికులతో వెళుతున్న పడవ బోల్తా
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, యెమెన్ సమీపంలో భారత నావికులతో వెళుతున్న పడవ బోల్తా
సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో, యెమెన్
తీరంలో ఒక పడవ ప్రమాదానికి గురైంది.
ఈ పడవలో 14 మంది భారతీయులు ఉన్నట్లు భారత రాయబార
కార్యాలయం వెల్లడించింది.
అక్టోబర్ 22న జరిగిన ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని
సేకరిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
న్యూజీలాండ్‌తో జరిగే రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం
న్యూజీలాండ్‌తో
జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్ గాయపడ్డాడు.
తొలి మ్యాచ్‌లో
ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను కేవలం ఒక పరుగు
మాత్రమే చేశాడు.
ఐదు మ్యాచ్‌ల
సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
టిబెట్‌లో భూకంపం, 16 మంది చనిపోయినట్టు చైనా మీడియా ప్రకటన
ఫొటో సోర్స్, CCTV via Reuters
ఫొటో క్యాప్షన్, టిబెట్‌లో భూకంపం
చైనా ప్రభుత్వ
మీడియా నివేదికల ప్రకారం,
టిబెట్‌లోని పర్వత ప్రాంతంలో రిక్టర్
స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వచ్చింది.
కనీసం 16 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
గురువారం రాత్రి
సంభవించిన భూకంప కేంద్రం నాగ్చు ప్రాంతంలోని బాకెన్ కౌంటీలో ఉందని, స్థానిక అత్యవసర నిర్వహణ బ్యూరోను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
బాకెన్ కౌంటీ టిబెట్
రాజధాని లాసాకు ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అధికారులు
అత్యవసర పరిస్థితిని ప్రకటించి,
ప్రభావిత ప్రాంతానికి సహాయక బృందాలను
పంపించారు. అక్కడ మరో 32 మంది కూడా గాయపడ్డారు.
స్థానిక నివేదికల ప్రకారం, ప్రభావిత
ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 339 ఇళ్లు
ధ్వంసమయ్యాయి.
ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో
రహదారులు మూసుకుపోయాయి, ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడం మరింత
కష్టంగా మారింది.
టిబెట్‌లోని ఖమ్డో, నింగ్చి నగరాల్లో
కూడా బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్, నవంబర్ 1న పోలింగ్, 3న లెక్కింపు
ఫొటో సోర్స్, Vizag DPRO
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురువారం రాత్రి విడుదల
చేసింది.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87
మున్సిపాలిటీలు/నగర పంచాయితీలకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 1న జరపనున్నారు.
అవసరమైన చోట్ల రెండో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. మూడో తేదీన ఓట్ల లెక్కింపు
ఉంటుంది.
వాస్తవంగా అక్టోబర్
14న నోటిఫికేషన్ ప్రకారం 16వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించారు. 19న అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అభ్యర్థులు తమ
నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. అయితే సుప్రీంకోర్టు
జోక్యంతో షెడ్యూల్ మారింది.
అభ్యర్థుల తుది
జాబితా ప్రకటన 25వ తేదీ వరకు
వాయిదా వేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను సుప్రీంకోర్టు
ఆదేశించింది. ఈలోగా పిటిషనర్ పార్టీ(వైసీపీ), లేదా వివిధ అభ్యర్థులు సమర్పించిన
విన్నపాలు పరిశీలించాలని
కోర్టు సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని
100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి తదుపరి ఎన్నికల ప్రక్రియను ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఘర్షణలు జరిగిన 4 పట్టణాల్లో అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం
కల్పించింది. శనివారం (24 అక్టోబర్ 2026) 3 గంటల వరకు నామపత్రాలు
దాఖలు చేయవచ్చు.
మైదుకూరులోని
అన్ని వార్డులు, రాజంపేటలోని 11 వార్డులకు, కడప కార్పొరేషన్‌లోని 11, తిరుపతిలోని
18 డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి
అయిన తర్వాత అక్టోబర్ 25వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. అదే రోజు ఉపసంహరణకు
గడువు విధిస్తున్నట్టు నోటిఫికేషన్ సవరించారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2
గంటల వరకు
ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.