‘మక్కా ఒప్పందం ఉన్నా తుర్కియేకు హూతీ రెబెల్స్‌తో పోరాడే ఉద్దేశం లేదు’

ఫొటో సోర్స్, Cem Tekkesinoglu/Anadolu via Getty Images
ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక పోరాటంలోనూ పాల్గొనే ఉద్దేశం తమకు లేదని తుర్కియే తెలిపింది.
వాస్తవానికి సౌదీ అరేబియా, పాకిస్తాన్‌తో కలిసి తుర్కియే ఉమ్మడి రక్షణ ఒప్పందం (మక్కా ఒప్పందం) కుదుర్చుకుంది.అయితే, సౌదీ అరేబియాపై దాడులు చేస్తున్న హూతీ తిరుగుబాటుదారులతో పోరాడేందుకు తుర్కియే నిరాకరించింది.
‘‘హూతీలతో ఎలాంటి పోరాటంలోనూ పాల్గొనే విషయాన్ని మేం పరిశీలించడం లేదు’’ అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తుర్కియే రక్షణ మంత్రి యాషర్ గులెర్ చెప్పారు.
సౌదీ అరేబియాకు తుర్కియే అందించే సైనిక సహాయం ప్రధానంగా దాడులను నిరోధించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికే ఉద్దేశించినదని ఆయన తెలిపారు.
ఆగస్టులో తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ‘మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, దాన్ని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.



