2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 5 లక్షలమంది ఎలా జీవిస్తున్నారు?

వీడియో క్యాప్షన్, ధారావిలో జీవితం
2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 5 లక్షలమంది ఎలా జీవిస్తున్నారు?
ప్రచురణ

ముంబయిలోని ధారావి మురికివాడలో తెలుగువారు అతి తక్కువ స్థలంలో అత్యంత ఇరుకైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.

కేవలం 10x10 అడుగుల చిన్న గదుల్లో ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కాలం వెళ్లదీస్తున్నారు.

కేవలం మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఇరుకు వీధులు, రెండు అడుగుల వెడల్పు గల ఇళ్లతో ఇక్కడి జనజీవితం ఎంతో కష్టంగా సాగుతోంది.

సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పులు రాలేదని స్థానికులు చెబుతున్నారు.

ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో సుమారు సుమారు 5,00,000మంది నివసిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం కాదు.

ధారావిలో 8-10మంది మనుషులు వందచదరపు అడుగుల ప్రదేశంలో నివసించాలి. ఇక్కడ 80% శాతం మంది పబ్లిక్‌ టాయిలెట్లను వాడతారు.

ఆ చిన్నచిన్న ఇరుకు సందుల్లోనే నివాసాలు, పరిశ్రమలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉండేవాళ్లలో చాలామంది రోజుకూలీలు.