కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

  2. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

    క్రికెట్, భారత జట్టు, బీసీసీఐ
    ఫొటో క్యాప్షన్, ప్రజ్ఞాన్ ఓజా

    అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓఝానుచీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ నియమించింది.

    భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌ను పురుషుల క్రికెట్ జట్టు కొత్త సెలెక్టర్‌గా నియమించింది.

    అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ), పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుని నియామకం కోసం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

    దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి, బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం రమేశ్ పొవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు తెలిపింది.

    పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ చేసిన సేవలను, ఆయన నిబద్ధతను, కృషిని బీసీసీఐ ప్రశంసించింది.

    2023జూలైలో అగార్కర్‌ చీఫ్ సెలక్టరయ్యాడు.

    అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రాతిపదిక ఆధారంగా ప్రజ్ఞాన్ ఓఝా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

    రమేశ్ పొవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు ముంబై, గుజరాత్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.

  3. కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

  4. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    పారా ఆసియా క్రీడలు
    ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.

  5. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

  6. ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?

  7. జంతర్ మంతర్ 2.0: ఈ నిరసనలకు ఎజెండాను ఎవరు నిర్దేశిస్తున్నారు, సీజేపీ తప్పటడుగులు వేస్తోందా?

  8. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

  9. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  10. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  11. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

  12. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  13. ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?

  14. అభిజీత్ దీప్కే బెయిల్‌పై ఆయన తల్లి ఏమన్నారు?

    సీజేపీ, నిరసన, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కే తల్లి

    అభిజీత్ దీప్కేకు బెయిల్ లభించడంపై ఆయన తల్లి అనితా దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.

    "నిన్నటి నుంచి మేం చాలా ఒత్తిడికి గురయ్యాం, ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉంది. మా అత్తయ్య చనిపోయి ఇంకా పది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఇది జరగడం మమ్మల్ని చాలా కలచివేసింది" అని ఆమె చెప్పారు.

    ‘‘నేను మొన్న ఉదయం అభిజీత్‌తో మాట్లాడాను. 'అమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి' అని అభిజీత్ నాతో చెప్పాడు’’ అని అనితా దీప్కే చెప్పారు.

  15. ‘అభిజీత్ దీప్కేకు కోర్టు షరతులు’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే..

  16. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  17. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  18. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎల్‌కే అడ్వాణీ

    ఎల్‌కే అడ్వాణీ , అపోలో

    బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

    “అడ్వాణీ ప్రస్తుతం ఐసీయూలో న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది” అని తెలిపింది.

  19. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  20. గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు