చంద్రయాన్-3: చంద్రుడివైపు విజయవంతంగా దూసుకుపోయిన ఇస్రో రాకెట్

చంద్రయాన్-3 రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్‌ను ప్రయోగించింది.