కోవిడ్: 24 గంటల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు

భారత్‌లో గత 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 63,562.

లైవ్ కవరేజీ

  1. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

  2. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  3. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  4. ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?

  5. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

  6. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  7. ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?

  8. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  9. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  10. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  11. గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు

  12. ‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

  13. కొలీగ్ తినాల్సిన కూరలో నత్తలను చంపే విషం కలిపినట్టు మహిళపై ఆరోపణలు, కేసు నమోదు..

  14. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

  15. ఆహారం తినగానే ‘షుగర్ లెవెల్స్’ పెరగడం ప్రమాదకరమా?

  16. అక్టోబర్ 20 వరకు సౌదీకి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

    సౌదీ అరేబియా, ఎయిర్ ఇండియా విమానాలు
    ఫొటో క్యాప్షన్, విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మామ్, జెడ్డాకు ఈనెల 20వ తేదీవరకు విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని , విమానాల రాకపోకల పునరుద్ధరణకు తగిన పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తున్నామని ఎయిర్ లైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

    విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమ అత్యుత్తమ ప్రాధాన్యత అని పేర్కొంది.

    అంతకుముందు, సౌదీలోని స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, వైమానిక దాడి జరిగితే ఇంట్లోనే ఉండాలని పౌరులను కోరుతూ భారత రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో సూచించింది.

    సౌదీ అరేబియా నుంచి తక్షణమే వెళ్లాల్సిన అవసరం ఉన్న భారతీయ పౌరులు బహ్రెయిన్, కువైట్, ఖతార్‌ నుంచి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది.

    ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించగా, 10 మంది గాయపడ్డారు.

  17. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టార్ లింక్
    ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  18. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  19. అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల, అమెరికాలో కాల్పులు
    ఫొటో క్యాప్షన్, బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్‌ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

    కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

    తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

    ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.

    ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  20. క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?