ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

  2. క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

  3. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

  4. ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?

  5. మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

  6. కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

  7. ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?

  8. ‘అభిజీత్ దీప్కేకు కోర్టు షరతులు’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే..

  9. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఒంటరిగా ఆడ తాబేలు సుదీర్ఘ యాత్ర.. చివరికి ఆ ఆలివ్ రిడ్లే ఏమైంది?

  10. గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

  11. పాకిస్తాన్‌కు ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ అధ్యక్ష పదవి

    పాకిస్తాన్, షరిఫ్, పాలక మండళ్లకు అధ్యక్ష బాధ్యతలు
    ఫొటో క్యాప్షన్, పాలక మండళ్లకు తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి అహద్ ఖాన్ చీమాను ఎన్నుకున్నారు.

    అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు గ్రూప్ (డబ్ల్యూబీజీ) పాలక మండళ్లకు పాకిస్తాన్ 2027లో అధ్యక్షత వహించనుందని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది. 1953 తర్వాత, 73 ఏళ్లకు పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది.

    బ్యాంకాక్‌లో జరిగిన డబ్ల్యూబీజీ-ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా పాలక మండళ్లకు తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి, ప్రపంచ బ్యాంకులో ఆ దేశ గవర్నర్ అయిన అహద్ ఖాన్ చీమా పేరును ప్రకటించారు.

    ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు అక్టోబర్ 12 నుంచి 18 వరకు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో 191 దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.

    కేంద్ర బ్యాంకుల గవర్నర్లు, ఆర్థిక విధాన రూపకర్తలు, వ్యాపార రంగ ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.

  12. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఎల్‌కే అడ్వాణీ

    ఎల్‌కే అడ్వాణీ , అపోలో

    బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

    “అడ్వాణీ ప్రస్తుతం ఐసీయూలో న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది” అని తెలిపింది.

  13. రష్యాపై అమెరికా ఆంక్షలను అడ్డుకున్న ట్రంప్

    డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యాపై ఆంక్షల బిల్లుపై సెప్టెంబరులోనే డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు, ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

    యుక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను శిక్షించడానికి అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఆమోదించిన రష్యా ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన అధ్యక్ష అధికారంతో అడ్డుకున్నారు.

    ఈ ఆంక్షలలో కొన్నింటిని నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజాల దృష్ట్యా అవసరమమని శుక్రవారం రాత్రి జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ట్రంప్ పేర్కొన్నారు.

    ఈ ఆంక్షల బిల్లుపై ట్రంప్ సెప్టెంబర్‌లోనే సంతకం చేయడంతో అది చట్టంగా మారి ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.

    నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నిక కంటే ముందే అమెరికాలో ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా రష్యా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ నవంబర్ ఎన్నికలే కాంగ్రెస్‌పై ఏ పార్టీ నియంత్రణ కలిగి ఉంటుందో నిర్ణయిస్తాయి.

    ట్రంప్ తాజా నిర్ణయాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

    ఈ ఆంక్షల చట్టానికి దివంగత రిపబ్లికన్ సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు, ఆయన జూలై 11న మరణించడానికి ముందు అమెరికాలో యుక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు.

    ఈ చట్టం ప్రధానంగా రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. అలాగే రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను ఎక్కువగా కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాలపై ముఖ్యంగా చైనా భారత్‌లపై 100 శాతం వరకు సుంకాలను విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించింది.

    అదనంగా, ఈ చట్టంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రస్తుత ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా ఉపయోగిస్తున్న రహస్య నౌకాదళంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

    అమెరికాకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధుల ఉమ్మడి బృందం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టాన్ని గౌరవించాలని కోరుతూ గురువారం ట్రంప్‌కు ఒక లేఖ రాసింది.

  14. గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు

  15. ‘ఎన్నికల సంఘంలో పరిణామాలపై సైబర్ ఫోరెన్సిక్ విచారణ జరపాలి’ - సుప్రీం కోర్టులో ఖమ్మం వాసి పిటిషన్

  16. కొలీగ్ తినాల్సిన కూరలో నత్తలను చంపే విషం కలిపినట్టు మహిళపై ఆరోపణలు, కేసు నమోదు..

  17. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించండి: మోదీకి ఖర్గే లేఖ

    కాంగ్రెస్, మల్లికార్జున్ ఖర్గే, నరేంద్రమోదీ
    ఫొటో క్యాప్షన్, మల్లికార్జున్ ఖర్గే

    నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    "2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

    "నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"

    ‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.

    ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

  18. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

  19. ఆహారం తినగానే ‘షుగర్ లెవెల్స్’ పెరగడం ప్రమాదకరమా?

  20. అక్టోబర్ 20 వరకు సౌదీకి ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

    సౌదీ అరేబియా, ఎయిర్ ఇండియా విమానాలు
    ఫొటో క్యాప్షన్, విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మామ్, జెడ్డాకు ఈనెల 20వ తేదీవరకు విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని , విమానాల రాకపోకల పునరుద్ధరణకు తగిన పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తున్నామని ఎయిర్ లైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

    విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమ అత్యుత్తమ ప్రాధాన్యత అని పేర్కొంది.

    అంతకుముందు, సౌదీలోని స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, వైమానిక దాడి జరిగితే ఇంట్లోనే ఉండాలని పౌరులను కోరుతూ భారత రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో సూచించింది.

    సౌదీ అరేబియా నుంచి తక్షణమే వెళ్లాల్సిన అవసరం ఉన్న భారతీయ పౌరులు బహ్రెయిన్, కువైట్, ఖతార్‌ నుంచి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది.

    ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించగా, 10 మంది గాయపడ్డారు.