లైవ్, 'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తేనే యువత వెనక్కు తగ్గుతుంది: సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్
"అక్టోబర్ 10న సీజేపీతో పాటు దేశంలోని యువత అంతా, అంటే కామ్రేడ్లంతా జంతర్ మంతర్ చేరుకోనున్నారు. మేం దిల్లీ పోలీసులకు అధికారికంగా సమాచారం అందించాం, శాంతిభద్రతలు కాపాడుతూ మాకు సహకరించాలని వారిని కోరాం" అని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
సారాంశం
- 'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తేనే యువకులు వెనక్కి తగ్గుతారు' అని సీజేపీ నేత సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.
- రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచింది, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని అంచనా.
- రాహుల్, ప్రియాంక గాంధీలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
లైవ్ కవరేజీ
'జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తేనే యువత వెనక్కు తగ్గుతారు': సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన గురించి దిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ చెప్పారు.
"దేశంలోని యువత అంతా, అంటే కామ్రేడ్లు అందరూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ చేరుకోనున్నారు. దీనిపై మేం దిల్లీ పోలీసులకు అధికారికంగా సమాచారం అందించాం. శాంతిభద్రతలు కాపాడుతూ మాకు సహకరించాలని కోరాం" అని ఆయన తెలిపారు.
"మేం అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేశాం, అండర్‌టేకింగ్ కూడా ఇచ్చాం. దేశ యువత మరోసారి రోడ్డెక్కుతున్నారు. ఈసారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేంత వరకు యువకులు వెనక్కి తగ్గరు" అని తెలిపారు.
"ఇది కేవలం సీజేపీ ఉద్యమం, నిరసన మాత్రమే కాదని నేను మళ్లీ చెప్పదలుచుకున్నాను. ఇది జెన్-జి, యువత చేస్తున్న పోరాటం. ఓట్ల చోరీ జరుగుతుంటే, ఎన్నికలను లాగేసుకుంటుంటే అది ప్రతి పౌరుడి సమస్య అవుతుంది. కాబట్టి దేశంలోని యువతంతా ఇందులో పాల్గొనాలి. 'ఛలో దిల్లీ' అనేది మా నినాదం. కాక్రోచ్‌లంతా ఒక్కచోట చేరాలి. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని ఆశిస్తున్నాం, దానికి అనుగుణంగానే పోలీసులకు సమాచారం ఇచ్చాం" అని సౌరవ్ దాస్ తెలిపారు.
