సీజేపీ నిరసన: సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని పోలీసులకు దిల్లీ హైకోర్టు ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
జూలై 20న జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల చర్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లపై దిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది .
బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలు కేవలం బాధితులపై వ్యక్తిగత ఫిర్యాదులు దాఖలు చేయడానికి మాత్రమే సూచించేవికావని పేర్కొంది.
"ఇది ఒకే ఒక్క సంఘటన అయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. వారిని వ్యక్తిగత ఫిర్యాదు చేసుకోమని పోలీసులు కోరడం సరైనదే కావచ్చు. కానీ ఇది అలాంటి కేసు కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది.
దీని తర్వాత కోర్టు పోలీసులను తమ సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.
సీసీటీవీ ఫుటేజ్, ఇతర వీడియో సాక్ష్యాలను భద్రపరచాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది.





